హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపుపై హామీ: మంత్రి

హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపుపై హామీ: మంత్రి

VSP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై ప్రభుత్వ విప్ చిరంజీవి రావు అమరావతిలో ఆర్థిక మంత్రిని కలిసి, స్థానిక ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. దీనికి స్పందించిన మంత్రి హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.