కరీంనగర్‌లో సినీ నటీ మెహరీన్ సందడి
KNR: కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌లో బుధవారం సినీ నటీ మెహరీన్ సందడి చేశారు. కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌ని మెహరీన్ ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమె కూడా అభిమానులకు అభివాదం చేస్తూ పలకరించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.