ఘనంగా వసంత నవరాత్రుల ముగింపు వేడుకలు

ఘనంగా వసంత నవరాత్రుల ముగింపు వేడుకలు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ ఆలయంలో శనివారం వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా నవదుర్గ అమ్మవారి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నవదుర్గ ఆలయ చైర్మన్ సూదనబోయిన ఓం ప్రకాష్ - రమ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.