భారత్ ఘర్షణకు దిగితే తీవ్ర పరిణామాలు: పాక్
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని భారత్ తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు. మరోసారి తమతో ఘర్షణకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఇటీవల రాజ్‌నాథ్ పాక్‌ను హెచ్చరించిన నేపథ్యంలో ఖవాజా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.