ప్రమాణ స్వీకారం చేయనున్న జనసేన జిల్లా అధ్యక్షుడు

ప్రకాశం: ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్టణంలోని ఏ-1 కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు.