VIDEO: నరకప్రాయంగా కొమ్మాది అమరావతి నగర్ ప్రధాన రహదారి

VIDEO: నరకప్రాయంగా కొమ్మాది అమరావతి నగర్ ప్రధాన రహదారి

VSP: కొమ్మాది అమరావతి నగర్ ప్రధాన రహదారి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారింది. రోడ్డంతా పెద్ద పెద్ద గోతులు పడి, ప్రయాణం నరకప్రాయంగా తయారైంది. వర్షం పడితే ఈ గోతులు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. దీనివల్ల వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు.