VIDEO: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే పర్యటన
VSP: మొంథా తుఫాన్ కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన విశాఖలోని 40వ వార్డులోని రాజీవ్ కాలనీలో మాజీ శాసనసభ్యుడు మళ్ళ విజయ ప్రసాద్ సోమవారం పర్యటించారు. తుఫాన్ వలన నష్టం కలిగిన రాజీవ్ కాలనీ రేకుల సెట్ల ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మళ్ళ విజయ ప్రసాద్ డిమాండ్ చేశారు.