పలు రెస్టారెంట్లపై రెవెన్యూ అధికారుల తనిఖీలు
SS: జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక టీమ్స్ ద్వారా కదిరి తహశీల్దార్ పర్యవేక్షణలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, రీఫిల్లింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. కమర్షియల్ సిలిండర్స్ కాకుండా డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారని గుర్తించి, వాటిని సీజ్ చేశారు. డొమెస్టిక్ సిలిండర్లు వాడకూడదని హెచ్చరించామని తహశీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు ప్రకటన విడుదల చేశారు.