అట్టహాసంగా ప్రారంభమైన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

ASF: తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారం గోలేటి గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డిలు పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు.