ఆసుపత్రుల అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు
అన్నమయ్య: మదనపల్లెలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలపై బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. జిల్లాలో కిడ్నీ రాకెట్ కుంభకోణం, పేద రోగులను దోపిడీ చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. ఇందులో భాగంగా పలు అధికారులు ఉన్నారు.