యువతకు ఆదర్శనీయుడు బాబు జగ్జీవన్ రామ్
MDK: వెల్దుర్తి మండలం ఎలుకపల్లి గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ పావని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.