సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

NTR: తిరువూరు పట్టణంలోని నాగార్జున పాఠశాలలో విద్యార్ధులకు పోలీసులు సైబర్ అవగాహన సదస్సును నిర్వహించారు. కమీషనర్ ఎస్.వీ. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆన్‌లైన్ భద్రత, సైబర్ నేరాలు, ఫ్రాడ్స్ & ఓటీపీ స్కామ్స్, మహిళలపై ఆన్‌లైన్ నేరాలు, పిడికిల్ చట్టం(POCSO) వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.