'మిర్యాలగూడకు ధాన్యం లారీలు రాకుండా కట్టడి చేస్తున్నాం'
NLG: మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖర రాజు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి మిర్యాలగూడకు ధాన్యం లారీలు రాకుండా కట్టడి చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌గేట్ వద్ద మహారాష్ట్ర నుంచి 6, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 లారీలను ధాన్యం లోడుతో సీజ్ చేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.