కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

JN: జనగామ మండలం చౌడారం గ్రామ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాస్థాయిని తెలుసుకున్నారు. గణితంపై పట్టు సాధించి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నతంగా ఎదగాలని సూచించారు. పాఠశాలలో సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించి విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.