ఎస్.కోటలో పడకేసిన పారిశుధ్యo

VZM: ఎస్.కోట శ్రీనివాస కాలనీ మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వెనక అంగన్వాడి భవనానికి అనుకొని విపరీతమైన చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తున్న పరిస్థితి నెలకొంది. పంచాయతీ అధికారులు స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకొని పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలానే ఉంటే అంగన్వాడి పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.