'అభ్యుదయ ఆలోచనలతో యువత ముందుకు సాగాలి'

'అభ్యుదయ ఆలోచనలతో యువత ముందుకు సాగాలి'

MHBD: మహనీయుల మార్గమే బహుజనులకు శిరోధార్యం అని, ప్రతి ఒక్కరూ అభ్యుదయ ఆలోచనలతో ముందుకు సాగాలని అని మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ సీఎస్ఆర్ఎంవో డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. మహబూబాబాద్‌లో శనివారం వాకర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏప్రిల్ నెలలో బహుజన మహా పురుషుల జయంతులను పురస్కరించుకుని అశోక చక్రవర్తి, మహాత్మాపూలే, డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ అనే నినాదంతో ర్యాలీ తీశారు.