కిడారి శ్రావణ్ కుమార్‌కు ఘన స్వాగతం
ప్రకాశం: రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా పాడేరు విచ్చేసిన కిడారి శ్రావణ్ కుమార్‌కు టీడీపీ అభిమానులు, జీసీసీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఘాట్‌లోని మోదకొండమ్మ అమ్మవారి పాదాలు వద్ద మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నక్కలపుట్టులో మహిళలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.