సింహాద్రిపురంలో ఏడు వారాల వ్రతం

KDP: సింహాద్రిపురంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రావణమాసం నాలుగవ శనివారం సందర్భంగా ఏడు వారాల వ్రతం నిర్వహించారు. ఈ మేరకు ఈ వ్రతానికి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తరలివచ్చారు. కాగా, వారితో అర్చకులు ముందుగా సంకల్పం చేయించి, మహాగణపతి పూజ వెంకటేశ్వరస్వామి అష్టోత్తరం, వేద మంత్రాల ఉచ్ఛరణ భక్తుల చేత చేయించారు.