రజక సంఘం నాయకుడు మృతి

రజక సంఘం నాయకుడు మృతి

NLG: చిట్యాలకు చెందిన రజక వృత్తిదారుల సంఘం నాయకులు ఐతరాజు రాములు (55) మృతి చెందడం పట్ల ఆ సంఘం జిల్లా నాయకులు ఐతరాజు యాదయ్య, అక్కెనపల్లి నాగయ్యలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం రాములు మృతదేహంపై పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘం మండల నాయకులు పాలమాకుల అర్జున్, ఆమనగంటి ముత్తయ్య పాల్గొన్నారు.