పది పాఠ్యాంశంగా కోనసీమ ప్రభల తీర్థం

పది పాఠ్యాంశంగా కోనసీమ ప్రభల తీర్థం

కోనసీమ: సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఏటా కనుమ రోజున కోనసీమ జిల్లాలో నిర్వహించే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి 426 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఏకాదశ రుద్రులు కొలువుదీరిన ప్రాచీన ప్రాంతమిది. ఇప్పుడు ఈ తీర్థం పదోతరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా మారింది. 'చేజారిన బాల్యం' పాఠంలో 'కోనసీమ జగ్గన్నతోట ప్రభల తీర్థం' పేరుతో ప్రచురించారు.