'ఆలయాలు, తీరప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి'
ప్రకాశం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు SP హర్షవర్ధన్ రాజు పలు కీలక సూచనలు చేశారు. కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాల్లో భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితోపాటు జాగ్రత్త వహించాలన్నారు. తోపులాటలు తోడు చేసుకోకుండా ఆలయ కమిటీలు చర్యలు తీసుకోవాలన్నారు.