వంశీ ఆరోగ్యం క్షీణించింది.. పంకజశ్రీ ఆవేదన

కృష్ణా: తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీని శుక్రవారం నూజివీడు కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని కోర్టు వద్ద ఆమె శుక్రవారం వాపోయారు. బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు చెప్పారు.