VIDEO: అంజన్న ఆలయంకు భారీగా తరలివచ్చిన దీక్ష స్వాములు

JGL: మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంకు బుధవారం హనుమాన్ దీక్ష స్వాములు భారీగా తరలివచ్చారు. శ్రావణమాసం ముగింపు దశలో ఉండటంతో, వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఇరుముడులతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, 11, 21 రోజుల దీక్షను విరమించుకున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.