'మహిళల ఆత్మ గౌరవం ఇనుమడింపచేసేలా చీరల పంపిణీ'

'మహిళల ఆత్మ గౌరవం ఇనుమడింపచేసేలా చీరల పంపిణీ'

RR: చేవెళ్ల ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి సంబంధించిన డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.