పాక్ వైమానిక దాడులు.. ఆరుగురు మృతి
అఫ్గానిస్తాన్‌లోని కాబుల్, కాందహార్‌లలోని నివాస గృహాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో ఆరుగురు పౌరులు మృతిచెందినట్లు తెలిపింది. కాందహార్ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్‌కు చెందిన ఇంధన నిల్వల కేంద్రాలను సైతం పాక్ లక్ష్యంగా చేసుకుందని అఫ్గాన్ పేర్కొంది.