భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్
NLR: జిల్లాలో ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయని, ఇంకా కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో సూచించారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్య కారులు వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు.