బొబ్బిలిలో తాగునీటి సరఫరాకు అంతరాయం
VZM: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు జంక్షన్, అన్న క్యాంటిన్ సమీపంలో పైపులైన్ లీకులు నివారణకు ఇవాళ తాగునీటి సరఫరాకు ఆంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మీ గురువారం తెలిపారు. పంపు హౌస్ నుంచి పట్టణానికి తాగునీరు సరఫరా అయ్యే ప్రధాన పైపులైన్ లీకులు నివారణ కోసం తాగునీటి సరఫరాకు ఆంతరాయం కలుగుతుందని, ప్రజలు సహకరించాలన్నారు.