VIDEO: వామ్మో ఇదేమి సుడిగాలి..!
అనకాపల్లిలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఒక్కసారిగా వీచిన సుడిగాలి కలకలం రేపింది. స్టేడియం ప్రాంగణంలో గాలి సుడులు తిరుగుతూ పైకి లేచడంతో తాత్కాలిక షెడ్లు, సామగ్రి చెల్లాచెదురయ్యాయి. మైదానంలో ఉన్న క్రీడాకారులు, స్థానికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. కొద్దిసేపు సాగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.