గౌరారంలో మూతపడిన పశువైద్యశాల

గౌరారంలో మూతపడిన పశువైద్యశాల

వికారాబాద్: దుద్యాల మండల పరిధిలోని గౌరారంలో గత కొన్నినెలలుగా పశు వైద్యశాల మూతపడింది. దీంతో పాడి పశువులకు సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి.. పశు వైద్య సిబ్బందిని నియమించి మూగజీవాలకు సకాలంలో వైద్యం అందించాలని కోరుతున్నారు.