VIDEO: జిల్లా టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల ఎంపిక
MDK: ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని మెదక్ గుల్షన్ క్లబ్‌లో నిర్వహించారు. రాష్ట్ర స్థాయికి 10 మందిని ఎంపిక చేయనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా టేబుల్ టెన్నిస్ కార్యదర్శి డా. కొక్కొండ ప్రభు తెలిపారు. ఇందులో గుల్షన్ క్లబ్ కమిటీ సభ్యులు మేడి మధుసూదన్ రావు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు, పీఈటీలు తదితరులు ఉన్నారు.