24 నుంచి ఏపీలో మరో కొత్త పథకం
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా.. మీ కోసం' కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో 'పంచసూత్రాలు' అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.