అజాగ్రత్తే ప్రమాదాలకు హేతువు: ఎస్సై చిరంజీవి

అజాగ్రత్తే ప్రమాదాలకు హేతువు: ఎస్సై చిరంజీవి

SRPT: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నాగారంలో పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌తోనే ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లారీ డ్రైవర్లు డిఫెన్స్‌ డ్రైవింగ్‌ పద్ధతులను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.