అంగన్వాడీ కేంద్రానికి గ్యాస్ పొయ్యి, కుక్కర్ బహుకరణ
NTR: ఏ కొండూరు మండలం కోడూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం నందు గ్యాస్ పొయ్యి, కుక్కర్ అవసరమై ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు యేలినేని చంద్రం, మల్లాది కృపానందం విషయం తెలుసుకొని సకాలంలో వాటిని బహుకరించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.