'ఏటీసీ సెంటర్లో కొత్త కోర్సులు'

'ఏటీసీ సెంటర్లో కొత్త కోర్సులు'

MNCL: జన్నారం మండలంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు ముందుకు రావాలని కళాశాల ప్రిన్సిపాల్ బండి రాములు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఏటీసీ సెంటర్లో కొత్తగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పారిశ్రామిక ఆటోమేషన్, రోబోటిక్స్ మెకాట్రానిక్స్ కోర్సులు వచ్చాయని, విద్యార్థులు సంప్రదించాలని ఆయన కోరారు.