మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

VZM: జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఎం.వెంకటాపురంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గజపతినగరంలోని సామాజిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తన స్వగృహం వద్ద కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పలువురు నాయకులు కార్యకర్తలు అరుణకు శుభాకాంక్షలు తెలిపారు.