చిత్రవతి నది ఒడ్డున లేజర్ షో
SS: సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సందడి నెలకొంది. చిత్రవతి నది ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రత్యేక లేజర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల కాంతుల మధ్య సత్యసాయి బాబా జీవిత విశేషాలను ప్రదర్శించగా, ఈ కనువిందు దృశ్యాన్ని చూసి భక్తులు ఆనంద పరవశులయ్యారు.