ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

W.G: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు.