VIDEO: వరంగల్ నగరాన్ని కప్పేసిన పొగమంచు
వరంగల్ నగర వ్యాప్తంగా గురువారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. వరంగల్–ములుగు ప్రధాన రహదారి, హనుమకొండ–వరంగల్ హంటర్ రోడ్డులో దృశ్యమానం తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇదే పొగమంచు ఖిల్లావరంగల్‌ను మరింత నూతన శోభతో అలంకరించి, కాకతీయుల శిల్ప సంపదను ఆహ్లాదకరంగా కనిపించేలా చేసింది.