నీటిని విడుదల చేసిన మంత్రి

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్-2 ప్రధాన కాలువ నుంచి నీటిని మంత్రి సత్యకుమార్ యాదవ్ విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీరు రావడంతో రైతుల కలలు నిజమవుతున్నాయని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.