టోల్ ప్లాజాలో వార్షిక పాస్‌పై అవగాహన

KMR: పిట్లం మండలం ధర్మారం టోల్ ప్లాజా వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వార్షిక పాస్‌పై శనివారం వాహనదారులకు అవగాహన కల్పించారు. టోల్ ప్లాజా మేనేజర్ పాండు పటేల్ మాట్లాడుతూ.. ఈ నూతన పథకం గురించి తెలియజేసేందుకు కరపత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ వార్షిక పాస్ వల్ల వాహనదారులకు ప్రయాణ ఖర్చు ఆదా అవుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.