రూ.16వేల విలువగల గుట్కా స్వాధీనం

రూ.16వేల విలువగల గుట్కా స్వాధీనం

WGL: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా గుట్కా విక్రయాలు జరుపుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం వరంగల్ ఇంతేజార్‌గంజ్ పరిధిలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.16వేల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ బాబులాల్ తెలిపారు