VIDEO: గణపురంలో తీవ్ర ఉద్రిక్తత

VIDEO: గణపురంలో తీవ్ర ఉద్రిక్తత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వెలుపల కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు క్షణాల్లో ఉద్రిక్తతకు దారితీయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశించి ఇరు వర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి పంపించారు.