తారామతి రిసార్ట్‌లో "ఈగల్ టీమ్" దాడులు
HYD: డ్రగ్స్ రహిత రాజధానిగా చూసేందుకు ఈగల్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గోల్కొండ పరిధిలోని తారామతి రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి ఈగల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. రిసార్ట్‌లో నిర్వహిస్తున్న 'జాక్, జాన్సన్' అనే ఈవెంట్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. అనుమానితులకు తక్షణమే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.