ఈ నెల 8వ తేదీ వరకు గడువు పొడగింపు
NLR: ఉదయగిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రైతులు పంటలను ఈ క్రాప్ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం గడువును ఈ నెల 8వ తేదీ వరకు పెంచినట్లు స్థానిక వ్యవసాయ సహాయ సంచాలకుడు చెన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలు సాగుచేసిన రైతులు తప్పకుండా రైతు సేవ కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి పంట నమోదు చేయించుకోవాలన్నారు.