VIDEO: చేపల వేటకు వెళ్లి.. ఇద్దరు మృతి

యాదాద్రి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాజ్పూర్ వద్ద గల చిన్నేటి వాగులో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను భువనగిరికి చెందిన వెంకటేష్, తాజ్పూర్‌కు చెందిన జహంగీర్ పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆసుపత్రి ఆవరణంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.