ఎదురుపాడులో ప్రారంభమైన బండలాగుడు పోటీలు

ఎదురుపాడులో ప్రారంభమైన బండలాగుడు పోటీలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడులో శ్రీరామనవమి సందర్భంగా అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని గెలుపొందిన వారికి రూ. 5వేల నుంచి రూ. 4వేల వరకు నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. నాలుగు పల్లాల విభాగంలో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.