లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
BHPL: లిఫ్ట్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మల్లేష్ చెప్పిన వివరాల ప్రకారం.. బైకుపై వెళ్తున్న వ్యక్తిని టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట వద్ద ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. ఆ వ్యక్తి మహిళను బైకుపై ఎక్కించుకొని పొదల్లోకి ఈడ్చుకెళ్లి గాయపరిచి, లైంగిక దాడిచేసాడు. ఆమె ప్రతిఘటించడంతో బ్యాగ్ లాక్కుని పరారయ్యాడు.