తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
JGL: కథలాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో నిర్వహణ, రికార్డుల సంరక్షణపై సమీక్షించి, పెండింగ్ ఉన్న భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ పనులు, భూసేకరణ, భూ భారతీ పోర్టల్‌లో పెండింగ్ ఉన్న సమస్యలపై ఆమె వివరాలు తెలుసుకున్నారు.