VIDEO: CSI చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

VIDEO: CSI చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

MDK: మెదక్ సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ప్రెస్ బీటర్ ఇంఛార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో తొలుత నిర్వహించిన సిలువ ఊరేగింపుతో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. బిషప్ ఎమెరిటస్ కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. సకల మానవాళి పాప విముక్తి కోసం యేసుక్రీస్తు సిలువపై తన ప్రాణాలను త్యాగం చేసిన రోజే 'గుడ్ ఫ్రైడే' అని ఆయన వివరించారు.