సాగర్, పులిచింతలలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి!
NLG: నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తిలో రికార్డు సృష్టించాయి. సాగర్ పవర్ హౌస్ మూడు నెలల్లోనే 150 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరగా.. పులిచింతలలో 1,400 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. రికార్డు స్థాయి ఉత్పత్తిపై హర్షం వ్యక్తమవుతోంది.